ఆదిత్య బిజినెస్ స్కూల్ విద్యార్థుల దాతృత్వం

UPDATED 25th OCTOBER 2017 WEDNESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ కి చెందిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎంబిఎ విద్యార్థులు సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొని ఆదర్శంగా నిలిచారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్న మదర్ థెరిస్సా వీధి బాలల పునరావాస కేంద్రాన్ని సందర్శించి వారికి అవసరమైన వస్తువులను అందచేసి వారితో ఉత్సాహంగా గడిపారు. అలాగే బాలలకు పుస్తకాలు, పెన్నులు, ఫ్యాన్లు, నిత్యావసర సరుకులు మొదలైన వాటిని కేంద్రం నిర్వాహకుడు విజయకుమార్ కు అందచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి ప్రోత్సాహంతో విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం డాక్టర్ జి.సుమ, గోవర్ధన్రెడ్డి, సౌజన్య, అప్పలకొండ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి అభినందించారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us