UPDATED 18th NOVEMBER 2017 SATURDAY 5:30 PM
భీమిలి: దివ్యాoగులు దైవంతో సమానమని ఇళ్ళ నాగేంద్రకుమార్ అన్నారు. తన కుమారుడు ఇళ్ళ ఆసిష్ సాయిరామ్ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నం జిల్లా భీమిలి తొట్లకొండ వారిజ ఆశ్రమంలో అంధ విద్యార్థులకు శనివారం మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో బాధపడకూడదన్నది తమ అభిమతమని, గత ఏడు సంవత్సరాలుగా తన కుమారుడు పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహచర చిన్నారులతో గడపడం వల్ల పిల్లలకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయని, ప్రతి ఒక్కరూ సేవా భావంతో కలిగి ఉండాలని, అందుకే పుట్టిన రోజు వేడుకలను ఆశ్రమ పాఠశాలల్లో జరుపుకుంటున్నామని తెలిపారు. పెద్ద పెద్ద హోటల్స్ లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కన్నా ఎటువంటి కల్మషం లేని ఇటువంటి చిన్నారుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తమకు చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇళ్ళ నాగతులసి, తదితరులు పాల్గొన్నారు.







