అఖిల భారత అథ్లెటిక్ మీట్ కు ఆదిత్య విద్యార్థులు ఎంపిక

UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 5:30 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య ఇంజనీరింగ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలకు చెందిన విద్యార్థులు అఖిల భారత అంతర్ యూనివర్సిటీ అథ్లెటిక్ మీట్ కు ఎంపికైనట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు మంగుళూరు యూనివర్సిటీ(మంగుళూరు)లో నిర్వహించనున్న ఈ పోటీలకు కె. దివ్యారెడ్డి (పెట్రోలియం టెక్నాలజీ-ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల), ఎస్. మోహన్ (సివిల్ ఇంజనీరింగ్-ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల), ఎమ్. మురళి(మెకానికల్ ఇంజనీరింగ్-ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల) ఎంపికయ్యారని, ఈ మేరకు జెఎన్టీయుకె రిజిస్ట్రార్ నుంచి ఉత్తర్వులు అందినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు సతీష్ రెడ్డి ఒక్కొక్కరికి రూ. ఐదు వేలు వంతున నగదు బహుమతులు అందజేసి, ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us