ఆదిత్యలో మహిళా హక్కులపై అవగాహనా పోటీలు

UPDATED 6th OCTOBER 2017 FRIDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో గ్రంథాలయశాఖ ఆధ్వర్యంలో మహిళా హక్కులపై అవగాహనా పోటీలు నిర్వహించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 300 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహించామన్నారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రూ.రెండు వేలు నగదు, ద్వితీయ బహుమతిగా రూ.1500, తృతీయ బహుమతిగా రూ.1000 తో ప్రశంసాపత్రాలను అందచేశామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే వారి రక్షణకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మేడపాటి శ్రీనివాస రెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, డాక్టర్  కె. రవిశంకర్, డాక్టర్ దివాకర్, గ్రంథాలయాధికారి  కె. అశోక్ కుమార్, సహాయ గ్రంథాలయాధికారి సి.హెచ్. వేణు, తదితరులు పాల్గొన్నారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us