గంగవరం (రెడ్ బీ న్యూస్) 6 డిసెంబర్ 2021 : రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనే అమలు జరుగుతోందని టీడీపీ నాయకులు విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వినతి పత్రాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద సమర్పించారు. అనంతరం కొత్తాడ, సూరంపాలెం పంచాయతీల్లో గౌరవ సభ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, ఓటిఎస్ బలవంతపు వసూళ్లు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున, ప్రధాన కార్యదర్శి భాను ప్రకాష్, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఆముదాల బంద ఎంపీటీసీ సభ్యుడు కృష్ణ శ్యామ్, శ్రీను గోపాలకృష్ణ, వీరబాబు, చిన్న వెంకటరమణ, సింహాద్రి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







