UPDATED 27th SEPTEMBER 2019 FRIDAY 9:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో స్ట్రైడ్స్-2019 లో భాగంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎరుడైట్-2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్ఐటి (ఆంధ్రప్రదేశ్) ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ అండ్ డీన్ అకడమిక్ అఫైర్స్ డాక్టర్ జి. రవికిరణ్ శాస్త్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ ప్రెజంటేషన్లు, పోస్టర్ ప్రజెంటేషన్లు విద్యార్ధుల ప్రతిభను వెలికితీయడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యలో విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి సాంకేతిక సదస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విద్యలో ప్రయోగాత్మక పరిజ్ఞానం విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ తెలిపారు. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి.ఎస్.వి. రామారావు మాట్లాడుతూ 37 పేపర్ ప్రెజంటేషన్లు, 36 పోస్టర్ ప్రెజంటేషన్లు, 21 మోడల్ ఎక్స్ పోలు, 35 టెక్నికల్ క్విజ్ లు, 16 కాంట్రాప్సన్ ప్రెజంటేషన్లు, 26 హైడ్రో రాకెట్ ప్రజెంటేషన్లు, 30 ఆర్ట్ గాలరీలు, 17 రోబో మారియోలు, 8 రోబో సోకర్స్, 9 ఏక్వాబోట్లు, వివిధ స్పాట్ ఈవెంట్లు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జెఎన్టీయుకె (కాకినాడ)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టర్ కె. ప్రసాద్, విజ్ఞాన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెసర్ అండ్ డీన్ ఎవాల్యూయేషన్ డాక్టర్ బి. సతీష్, గీతం యూనివర్సిటీ (విశాఖపట్టణం)కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ డాక్టర్ కె.సురేష్ న్యాయనిర్ణేతలుగా, ఎరుడైట్-2019 కోఆర్డినేటర్లుగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎస్. శ్రీకాంత్, కె. అరవింద వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్, డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, ఇసిఇ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. నగేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







