UPDATED 28th NOVEMBER 2018 WEDNESDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో అపిటా (ఎపిఐటిఎ) ఆధ్వర్యంలో కార్యశాలను బుధవారం నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో మూడవ, నాల్గవ సంవత్సరం విద్యార్థులకు రెండురోజుల పాటు నిర్వహించే ఈ కార్యశాలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సాఫ్ట్ స్కిల్స్ నిపుణులు కె.ఆర్.జె. కెనడీ హాజరై సాఫ్ట్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్, మానసిక వికాసానికి సంబంధించిన విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఐ2ఇ వెంచర్ ఇన్సియేషన్ సెంటర్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఎంటర్ ప్రెన్యూర్ పిన్ క్లబ్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎంటర్ ప్రెన్యూర్ ఎవేర్ నెస్ సెషన్స్, యువ పారిశ్రామికవేత్తలకు అవగాహనా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఎస్.ఎస్.డి సి ప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







