శాకాంబరీ దేవిగా నూకాలమ్మ అమ్మవారు

UPDATED 19th JULY 2020 SUNDAY 5:00 PM

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో కొలువై ఉన్న నూకాలమ్మ అమ్మవారు శాకాంబరీ దేవిగా ఆదివారం భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా పచ్చని కూరగాయలతో ప్రత్యేక శోభ సంతరించుకుంది. వర్షాకాలం ప్రారంభమైన తరువాత కూరగాయలతో అమ్మవారిని అర్చించడం ద్వారా రైతులకు ఫలసాయం బాగా వచ్చి లోకమంతా సుభిక్షంగా ఉంటుందని, శాకాంబరిగా అమ్మవారిని దర్శించుకుంటే ఆహారానికి ఎలాంటి లోటుండదని పండితులు ఈ సందర్భంగా వివరించారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us