UPDATED 24th DECEMBER 2017 SUNDAY 10:00 PM
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. 1991-92 సంవత్సరం పదవతరగతి బ్యాచ్ విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకుని తమ తీపి జ్ఞాపకాలను ఒకరినొకరు పంచుకున్నారు. అలాగే ఎవరికివారు తమ యోగ క్షేమాలను అడిగి తెలుసుకొంటూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకొంటూ ఉత్సాహంగా గడిపారు. అలాగే అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి వారిని పూలమాలలతో, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కలయికలో తమ చిన్ననాటి స్నేహితులను కలుసుకునేందుకు హైదరాబాద్, సింగపూర్, తదితర ప్రాంతాల నుంచి సైతం వచ్చి తాము చదువుకున్న పాఠశాలను, తమ స్నేహితులు, వారి కుటుంబసభ్యులతో ఉల్లాసంగా గడిపారు. ఈ కలయికలో ప్రస్తుత పెద్దాపురం జెడ్పిటిసి సుందరపల్లి శివనాగరాజు కూడా అదే బ్యాచ్ కు చెందడంతో వారితో కలిసి తాము చదువుకున్నరోజులను తన స్నేహితులతో కలిసి గుర్తు చేసుకున్నారు.







