తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

UPDATED 31st MARCH 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: మండలంలోని  పెదబ్రహ్మదేవం గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పేపకాయల సత్యనారాయణ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి ఏడు కాసుల బంగారు ఆభరణాలు, ఇరవై వేల రూపాయల నగదు దోచుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని సత్యనారాయణ పోలీసులకు సమాచారం అందించారు. పెద్దాపురం సిఐ ప్రసన్న వీరయ్యగౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us