సబ్-జూనియర్ కబడ్డీ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

UPDATED 4th SEPTEMBER 2018 TUESDAY 6:30 PM

సామర్లకోట: సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన 68వ బాలుర, బాలికల సబ్-జూనియర్ కబడ్డీ పోటీల్లో స్థానిక అయోధ్యరామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎస్. మణికంఠ, కె. నందిని సబ్-జూనియర్ కబడ్డీ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ఈ నెల 21 నుంచి 25 వరకు చిత్తూరు జిల్లా పుంగనూరులో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, పిఇటి తాళ్ళూరి వైకుంఠం, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.     
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us