హోం గార్డు కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందచేత

UPDATED 15th AUGUST 2020 SATURDAY 5:00 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ. ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చెక్కును జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి శనివారం అందచేశారు. రైలు ప్రమాదంలో గత జనవరి నెల ఐదవ తేదీన విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన హోంగార్డు ఆర్.ఎస్.వి. శివ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన  ఇన్సూరెన్స్ సొమ్ము బాపతు చెక్కును మృతుని భార్య దేవికి స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో అందచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీలు ఎం. అంబికా ప్రసాద్, ఎస్. మురళీ మోహన్, హోంగార్డు ఆర్ఐ వై. రవికిరణ్, బి సూపరెంటెండెంట్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us