ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న ఆదిత్య కాంపస్

UPDATED 5th MARCH 2018 MONDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ సోమవారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ నెల ఎనిమిదవ తేదీన క్యాంపస్ లో షిర్డీ సాయిబాబా, సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూతబలి, శాలా ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, అంకురార్పణ, ధ్వజారోహణం, అగ్ని ప్రతిస్థాపనం, తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఆరు, ఏడవ తేదీలలో విశేష పూజలు, ఎనిమిదవ తేదీన గణపతిపూజ, గర్తన్యాసం, వీర్యద్రవ్యానిక్షేపణం, యంత్రస్థాపన, బింబస్థాపన, కళాన్యాసం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావాలని ఆయన కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us