గైట్ లో ప్రారంభమైన సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 6:30 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(గైట్) అటానమస్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్, ఎంసిఏ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఏపిఐటిఏ)చే సైబర్ సెక్యూరిటీ సింప్లిఫైడ్ అనే అంశంపై మంగళవారం వర్క్ షాప్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏపిఐటిఏ జిల్లా మేనేజర్ ఎన్. వంశీ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విభాగాల మీద విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వేదికగా ఏపిఐటిఏ క్యాంపస్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఏటీఎం కార్డులు, జిమెయిల్ వంటి వాటి పాస్ వర్డ్స్ హ్యాక్ కాకుండా భద్రంగా ఉంచే విధానాలపై ఈ వర్క్ షాప్ లో ఆచరణాత్మక, సైద్ధాంతిక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్యాంపస్ శిక్షణా కార్యక్రమాలతో పాటు లుక్ ఫర్ ఎంప్లాయిస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ద్వారా ఉద్యోగ నియామకాలకు రిక్రూట్మెంట్ డ్రైవులు జిల్లాస్థాయిలో ప్రతీ నెలా రెండు వంతున నిర్వహిస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ మూడురోజులపాటు సైబర్ సెక్యూరిటీ అనే అంశంపై ఈ వర్క్ షాప్ జరుగుతుందని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆధునిక సాంకేతిక పద్దతులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిపిఎం కె. వల్లీమాధవి, ఎంసీఏ విభాగాధిపతి తమిళ్ కోడి, రిసోర్స్ పర్సన్స్ పి. వెంకట్రాజు, ఎం. హరికాంత్, తదితరులు పాల్గొన్నారు.      
      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us