UPDATED 23rd SEPTEMBER 2019 MONDAY 6:00 PM
గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య టెక్నికల్ హబ్ ఆధ్వర్యంలో "కోడ్-ఏ-థాన్" అనే కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 57మంది ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొని హ్యాకర్ ర్యాంక్ అనే అప్లైడ్ కోడింగ్ ప్లాట్ ఫామ్ మీద పైథాన్ ప్రోగ్రామింగ్ పై నిర్వహించడం జరిగింది. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో 55మంది విద్యార్థులు 5స్టార్ రేటింగ్ సాధించారని టెక్నికల్ హబ్ సిఈవో బాబ్జి నీలం తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనేక మందికి కోడింగ్ ప్రతిభ ద్విగుణీకృతమవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు కోడింగ్ పై అనేక విషయాలు అనుభవపూర్వకంగా నేర్చుకున్నారని తెలిపారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉన్న ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి టెక్నికల్ టీమ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ హబ్ టీమ్ బి. రాజేష్, ఆర్. సుధీర్, ఎం. అశోక్, తదితరులు పాల్గొన్నారు.







