అవార్డు గ్రహీతకు సన్మానం

UPDATED 27th JANUARY 2020 MONDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నుంచి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న పబ్లిక్ హెల్త్ వర్కర్  బంగారు చంద్రరావును స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని, చంద్రరావును ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈఈ సిహెచ్ రామారావు, మేనేజర్ అచ్యుతరాజు, ఆర్ఓరవిబాబు, టిపీఓ జ్యోషికుమార్, శానిటరీ ఇనస్పెక్టర్ రాజశేఖర్, వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాసు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us