ఇంటర్ కాలేజియేట్ లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 23rd OCTOBER 2018 TUESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు జెఎన్టీయుకె వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి పతకాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ తెలిపారు. ఈ నెల 20 నుంచి 21వరకు రాజాంలోని జిఎంఆర్ ఐటి కళాశాలలో నిర్వహించిన జెఎన్టీయుకె ఇంటర్ కాలేజియేట్ పోటీలలో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ట్రిపుల్ ఇ ద్వితీయ సంవత్సరం విద్యార్థి కెటివిఎన్ సాయికుమార్ బంగారు పతకం, బెస్ట్ ఫిజిక్ విభాగంలో సివిల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థి ఎంజెవి సతీష్ సిల్వర్ మెడల్ సాధించారని డాక్టర్ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్&డి డాక్టర్ కె.వి.ఎస్.ఆర్. మూర్తి, వివిధ విభాగాల అధిపతులు, కళాశాల ఫిజికల్ డైరెక్టర్స్ ఎన్. శంకర్, ఎమ్. రాజు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us