UPDATED 1st MARCH 2018 THURSDAY 5:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల ఎనిమిదవ తేదీన ఐదున్నర అడుగుల శ్రీ షిరిడీ సాయినాథుడు, నాలుగున్నర అడుగుల సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు జరగనున్నట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని గత నెల 25వ తేదీన మాలధారణ ధరించిన 108 భక్తుల దైవనామ స్మరణలతో ఆదిత్య ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉదయం నుంచి రాత్రి వరకు విశేష పూజలు, అభిషేకాలు, హారతులతో పలు కార్యక్రమాలు ఎంతో నిష్టగా సాగుతున్నాయి. ఈ నెల 5, 6, 7 తేదీలలో జరుగు గణపత్యాది పంచాయతన దేవతారాధన, హోమం, నీరాజన మంత్రపుష్పం, విశేష పూజలు, విగ్రహ ప్రతిష్టామహోత్సవాలలో యావన్మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన తెలిపారు.







