ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి

UPDATED 13th APRIL 2018 FRIDAY 7:00 PM

పెద్దాపురం: ట్రాఫిక్ నిబంధనలు ఆటో డ్రైవర్లు, భారీ వాహనాల డ్రైవర్లు విధిగా పాటించాలని డిఎస్పీ చిలకా వెంకట రామారావు పేర్కొన్నారు. స్థానిక రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహన డ్రైవర్లకు ఆరోగ్య కార్డులను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని శుక్రవారం మాట్లాడారు. రహదారుల్లో ప్రయాణించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, తద్వారా ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. ఆర్టీసీ డిఎం థామస్ బాబు మాట్లాడుతూ వ్యసనాలకు దూరంగా ఉండాలని, అలాగే ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడిపి నమ్ముకున్నవారిని అనాథలుగా చేయవద్దని సూచించారు. అనంతరం ఆరోగ్యరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించి హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ పద్మాకర్, ఇన్ చార్జ్ ఫైర్ ఆఫీసర్ రాంబాబు, ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ వర్మ, ప్రగతి కళాశాల ప్రొఫెసర్ విష్ణు, తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us