BCCI: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు రోహిత్‌ దూరం.. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌

రెడ్ బీ న్యూస్, 31 డిసెంబర్ 2021: దక్షిణాఫ్రికాతో త్వరలో జరుగనున్న వన్డే సిరీస్ కోసం తుది జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్నా.. పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పక్కన పెట్టింది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సీనియర్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రాను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు కూడా రోహిత్‌ దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లను కూడా సెలెక్షన్‌ కమిటీ పక్కన పెట్టింది. వీరి స్థానంలో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, వాష్టింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us