UPDATED 4th FEBRUARY 2019 MONDAY 9:00 PM
సామర్లకోట: గత సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎమ్ తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు జె. చరిష్మా, బాలం ఝాన్సీ లక్ష్మీబాయి ఎంపికయ్యారని తెలిపారు. మండలస్థాయిలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఎంపిక కాగా వారిలో తమ పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉన్నట్లు ఆయన తెలిపారు. వీరికి నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి రూ.12 వేలు చొప్పున స్కాలర్ షిప్ లభిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య, కౌన్సిలర్ మట్టపల్లి లక్ష్మీభ్రమరాంబ, ఉపాధ్యాయులు, తదితరులు అభినందించారు.







