UPDATED 18th JANUARY 2019 FRIDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణాన్ని రోటరీ ఫౌండేషన్ కు రూ. 100 కోట్లు (14.7 మిలియన్ అమెరికన్ డాలర్ల) ఆర్ధిక సహాయం అందించిన దాత, భారతదేశ బిల్ గేట్స్ గా పేరుగాంచిన రోటరీ డాకోజు రవిశంకర్ ఆదిత్యను సందర్శించారు. ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి వారికి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొప్ప కార్యాలు సాధించాలంటే గొప్ప మనసు ఉండాలని, అటువంటి విశాల హృదయం గల రవిశంకర్ తమ దాతృత్వంతో రోటరీ ద్వారా మెరుగైన సమాజం కోసం సేవలందించేందుకు ప్రోత్సహించడం అయన అసాధారణ వ్యక్తిత్వానికి నిదర్శనం అని ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి అన్నారు. రవిశంకర్ డాకోజు మాట్లాడుతూ నేను చేసింది ఘనమైన కార్యం ఏమీ కాదని, సమాజం నాకెంతో ఇచ్చిందని నావంతుగా సమాజానికి కొంత ఇచ్చానని అన్నారు. మనిషి తన జీవితంలో సమాజానికి ఏదో ఒకటి మంచి చేసి చూపాలని, మనకు తెలిసిన గొప్పవారంతా పోతూ తమ వెంట ఏమీ తీసుకుపోలేదని అన్నారు. ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల మందిరం, మసీద్, చర్చిలను దర్శించి సర్వమత సమానత్వం తోటే శాంతి నెలకొంటుందని, అందుకు ఆదిత్య ప్రాంగణం చక్కటి ఉదాహరణగా నిలవడం ఆనందదాయకం అని అన్నారు. డాక్టర్ పూషా మాట్లాడుతూ కోటు వేసుకొన్న వారికి కోట్లు ఉండవని, కోట్లు ఉన్నవారికి దానం చేసే హృదయం ఉండదని, అలా రెండు ఉన్న వ్యక్తి మన రవిశంకర్ అని, ఈయన తల్లి కుటుంబీకులు పెద్దాపురం పట్టణానికి చెందిన వారు కావడం మన అందరి అదృష్టమని అన్నారు. అనంతరం రవిశంకర్ డాకోజును ఆదిత్య యాజమాన్యం దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రోటరీ క్లబ్ మెంబర్స్ బాబీ, తదితరులు పాల్గొన్నారు.







