UPDATED 7th JANUARY 2020 TUESDAY 10:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకే్‌షను పోలీసులు అరెస్టు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్రమ అరెస్టులను నిరసిస్తూ మంగళవారం రాత్రి పార్టీ నాయకులు స్థానిక మఠం సెంటరు నుంచి స్టేషన్ సెంటరు వరకు కాగడాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చకూడదని, రైతులకు, మహిళలకు మద్దతుగా గద్దే రామ్మోహన్‌రావు చేస్తున్న దీక్షను విరమింపజేసి వస్తున్న లోకేష్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. ఈ చర్య వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ చిన్ని, అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే బాబు, రాంబాబు, వంశీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.







