UPDATED 26th DECEMBER 2019 THURSDAY 8:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని నిరసిస్తూ పెద్దాపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం కోర్టు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం (మణి) మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తే సహించేదిలేదని, రాష్ట్ర మూలన హైకోర్టు ఏర్పాటు చేస్తే ప్రజలు అనేక ఇబ్బందులు పడతారని అన్నారు. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు దేవులపల్లి సూర్యనారాయణ, జివిఎస్ నారాయణ, కొత్తెం చంటిబాబు, కందుల కుమార్, డి. విల్సన్ రాయ్, తటవర్తి సత్యనారాయణ, అత్తిలి ప్రభూజీ, తదితరులు పాల్గొన్నారు.







