IJU: ఐజెయూ సభ్యుడు రాంబాబుకు అభినందనల వెల్లువ

UPDATED  31st OCTOBER 2022 MONDAY 05:00 PM

IJU : ఐజెయూ సభ్యుడిగా ఎన్నికయిన సీనియర్ జర్నలిస్ట్, పెద్దాపురం సాక్షి రిపోర్టర్ రాకుర్తి రాంబాబు జాతీయ నాయకులచే అభినందనలు అందుకున్నారు. చెన్నైలో మూడురోజుల పాటు నిర్వహించిన ఐజెయూ పదవ ప్లీనరీకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఐజెయూ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికయిన ఎం. శ్రీరామమూర్తి, కె. స్వాతిప్రసాద్, ఆర్ .రాంబాబు, సయ్యద్ హుస్సేన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంజిబాబులు హాజరయ్యారు.

కాకినాడ జిల్లా తొలి ఐజెయూ సభ్యుడుగా ఎన్నికయిన రాంబాబు 20 ఏళ్ల నుంచి జర్నలిజం వృత్తిలో కొనసాగుతూ యూనియన్ బలోపేతానికి చేసిన కృషిని ఈ సందర్భంగా అభినందించారు. గతంలో పెద్దాపురం శ్రీ ప్రకాష్ స్కూల్ లో ఏపీయూడబ్యూజె రాష్ట్ర మహాసభలు విజయవంతంగా నిర్వహించిన ఘనతను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఐజెయూ జాతీయ నాయకులు దేవులపల్లి అమర్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి బల్వీందర్ సింగ్ జమ్మూ, ఏపీయూడబ్యూజె రాష్ట్ర నాయకులు ఐ.వి. సుబ్బారావు, చందు జనార్దన్, నల్లి ధర్మారావు, శ్యామ్ సుందర్ లు అభినందించారు.

జాతీయ స్థాయిలో పెద్దాపురం నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన రాకుర్తి రాంబాబును ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నియోజవర్గ ఇంచార్జీలు తుమ్మల రామస్వామి, తుమ్మల పద్మజ, తుమ్మల దొరబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, మాజీ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, జెడ్పీటీసీ సభ్యుడు గవరసాన సూరిబాబు, ఎంపిపి పెంకే సత్యవతి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ముప్పన శ్యామలంబ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కనకాల మహాలక్ష్మి, చైర్ పర్సన్ బొడ్డు తులసీ మంగతయారు, ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, సిఐటియు నాయకులు సిరిపురపు శ్రీనివాస్, డి. క్రాంతి కుమార్, సీనియర్ పాత్రికేయులు, మన పెద్దాపురం ఫేస్ బుక్ టీం, ఎస్ఎంఎస్, ప్రజా సంఘాల నాయకులు, ఆయా జర్నలిస్ట్ సంఘాల యూనియన్ నాయకులు, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us