* ఎంపిపి గుడాల రమేష్
UPDATED 9th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
పెద్దాపురం: ఆరుగాలం కష్టించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఎంపిపి గుడాల రమేష్ అన్నారు. మహిళా స్వయం సహాయక సంఘం ఆధ్వర్యంలో మండల పరిధిలోని పులిమేరులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి రమేష్ మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి చేస్తానని నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అనేక సబ్సిడీలు అందిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. రైతులు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), ఎపిఎం వేదకుమారి, ఎంఇవో దుర్గాప్రసాద్, సిసి శ్రీనివాస్, స్వయం సహాయక సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.







