UPDATED 19th FEBRUARY 2019 TUESDAY 8:00 PM
పెద్దాపురం: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు మండల పరిధిలోని దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్లకు మద్దతుగా శాంతి ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో చెలరేగిపోతున్న ఉగ్రవాదాన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని, మనం స్వేచ్ఛగా, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవిస్తున్నామంటే దానికి కారణం సరిహద్దుల్లో సైనికులే అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులంతా మౌనం పాటించి అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కె.ఆర్. సందీప్, ప్రిన్సిపాల్ సర్వం, ఏసీవో కె. పెదకాపు, ఈవో జెన్నిబాబు, విభాగాధిపతులు బేతినీడి వీరేంద్ర, రామకృష్ణ, బివి రెడ్డి, లక్ష్మణ్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







