UPDATED 6th JUNE 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: సేవల్లో స్వచ్ఛత కనబరుస్తూ, మానవ సేవలో తరిస్తున్న అమ్మాభగవాన్ సేవలు ఆదర్శనీయమని వర్ధినీడి విజయ అన్నారు. సామర్లకోట మండంలం హుస్సేన్‌పురం గ్రామం ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం అమ్మా భగవాన్ కమిటీ సభ్యుల సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 400 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, 150 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేసి, 25 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేసినట్లు వేమగిరి పరమహంస యోగానంద ఆసుపత్రి వైద్యులు వి.ఎస్. గౌతమ్, కోఆర్డినేటర్ చంటిబాబు, టెక్నిషీయన్ ప్రవీణ్ తెలిపారు. ఈ సంధర్భంగా అమ్మా భగవాన్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ అమ్మా భగవాన్ సంస్థ సేవలు కాకినాడ, సామర్లకోట, పిఠాపురంతో పాటు తదితర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మా భగవాన్ సంస్థ సభ్యులు కాకరపల్లి ఏడుకొండలు, కాకరపల్లి రమణమూర్తి, కాకరపల్లి భాస్కరరావు, నూకరాజు, విఠల్, నాగసత్యవాణి, భవ్య, భక్తవర్, శ్రీలక్ష్మి, తనూజ, అనిత, అనంతలక్ష్మి, వెంకటలక్ష్మి, జయలక్ష్మి, సూర్యావతి, తదితరులు పాల్గొన్నారు.







