UPDATED 23rd OCTOBER 2017 MONDAY 5:00 PM
సామర్లకోట : నాగులచవితి పర్వదినాన్ని ప్రజల అత్యంత భక్తి శ్రద్దలతో సోమవారం జరుపుకున్నారు. దీనిలో భాగంగా తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానాలు ఆచరించి పుట్టల వద్దకు చేరుకుని నాగేంద్రుడుకి ఇష్టమైన పాలు, చిమ్మిలి, చలివిడి, గుడ్లు మొదలయినవి నైవేద్యంగా సమర్పించారు. అలాగే బాణాసంచా కాల్చుతూ ఘనంగా జరుపుకున్నారు.







