UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక అయోధ్యరామపురంలో గల ఎయిడెడ్ ప్రాధమిక పాఠశాల(తాతబడి) సరైన వసతులు లేక శిథిలావస్థకు చేరుకోవడంతో దాతలు సహకారంతో అభివృద్ధి చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు. పాఠశాల పునర్నిర్మాణానికి సహకరించిన దాతలు పెనుపోతుల సత్యనారాయణ (పిఎస్ తారాపోలిన్స్), లయన్స్ క్లబ్ సభ్యులు ఆదినారాయణరెడ్డి, డాక్టర్ పూషా, కమలాకర రెడ్డి, గంజి బాబ్జి, బడుగు శ్రీకాంత్ గారికి, పాఠశాల మేనేజరు మంత్రి వరప్రసాద్, బొట్టా సోమేశ్వరరావు, మల్లిపూడి సత్యనారాయణలను పాఠశాల యాజమాన్యం మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ (స్మార్ట్ సామర్లకోట), అయోధ్య యూత్, డెవిల్స్ యూత్, భుజంగసాయి తారపాలిన్స్, చెరుకూరి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







