విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి

UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి  కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు అన్నారు. స్థానిక అయోధ్యరామపురం మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన రెండు జతల యూనిఫాంలను 27 వార్డు కౌన్సిలర్ మట్టపల్లి లక్ష్మీ భ్రమరాంబ, మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, ఎస్ఎంసి చైర్ పర్సన్ ఎస్. గంగాభవాని శనివారం విద్యార్థులకు  అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, స్కాలర్ షిప్ తదితర అనేక సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉండడంతో నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్నభోజన పథకం, విదార్థినులకు  సైకిళ్ళు వంటి వివిధ ప్రోత్సాహకాలు అందచేస్తున్నారని, ప్రతీ ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో  చేర్పించాలన్నారు. అనంతరం పాఠశాల క్రాఫ్ట్ టీచర్ శిక్షణలో విద్యార్థులు తయారుచేసిన పలు బొమ్మలు, వస్తువులను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహమ్మద్ షఫీయుల్లా, జి. గోవిందు. ఏ.ఎల్.వి. కుమారి, కె. శ్రీనివాస్, జి. రమాదేవి, ఏ. శ్రీవల్లి, కె. సుబ్రహ్మణ్యేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన చరక విశేషంగా ఆకట్టుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us