UPDATED 17th SEPTEMBER 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట పట్టణ పరిధిలోని గణేష్ కాలనీలో మున్సిపల్ కుళాయిల నుంచి బురద నీరు సరఫరా అవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలకు త్రాగునీరుగా సరఫరా చేస్తున్నారని, అయితే గత రెండు రోజులుగా కుళాయిల నుంచి బురద నీరు వస్తుండడంతో త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ డిఇ రామారావును వివరణ కోరగా పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కుళాయిల ద్వారా త్రాగునీరు సక్రమంగా వస్తుందని, కేవలం గణేష్ కాలనీలో పైపులైను లీకేజీ వల్ల సమస్య ఉందని, దీన్ని తక్షణం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కుళాయిల ద్వారా సరఫరా నిలుపుదల చేసి సంచార నీటి ట్యాంకులు ద్వారా త్రాగునీరును సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు.







