ఆదిత్యలో మెగా జాబ్ మేళాకు విశేష స్పందన

UPDATED 29th MAY 2018 TUESDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఈ నెల 28, 29 తేదీలలో రెండురోజులపాటు నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సమాచార, సాంకేతిక సంస్థ (ఎపిఐటిఎ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల 13 జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే సత్ సంకల్పంతో ఈ మెగా జాబ్ మేళాలు ఇక్కడ నిర్వహించామని, సాంకేతిక విద్యార్హతలు గల అభ్యర్థులతో పాటు సాధారణ విద్యార్హతలు గల అభ్యర్థులు సైతం ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యారని జిల్లా అభివృద్ధి సంస్థ జనరల్ మేనేజర్ రవీంద్ర తెలిపారు. ఆదిత్య యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాకు చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కళాశాల సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ సహకారాలు అందించడం వల్లే విజయవంతం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ,  ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us