నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో గైట్ ఒప్పందం

UPDATED 27th NOVEMBER 2018 TUESDAY 9:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (గైట్) కళాశాలలో వెంచర్ డవలప్ మెంట్ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం సమావేశం నిర్వహించారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ ఉదయ్ భక్షి మాట్లాడుతూ బోస్టన్ లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో కలిసి ఎ.పి.ఎస్.ఎస్.డి.సి ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ డవలప్ మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రముఖ పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం అమలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని, దీనికి నిధులను అధికంగా ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని అన్నారు. గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశి కిరణ్ వర్మ మాట్లాడుతూ నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీతో కలిసి తమ సంస్థలో వెంచర్ డవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నామని అన్నారు. వినియోగదారుల అవసరాలను, మార్కెట్ పోటీని అనుసరించి వినూత్నఆలోచనలతో పరిశ్రమల స్థాపనకు యువ ఇంజినీర్లు ముందడుగు వేయాలని కోరారు. ఆటువంటి ఔత్సాహికులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఐ&ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుంది ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ ఇంజనీరింగ్ కళాశాల, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిసిపాల్స్ డాక్టర్ ఎస్. సూర్యనారాయణ రాజు, డాక్టర్ పిఎంఎస్ఎస్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి, డాక్టర్ ఎన్. లీలావతి, డైరెక్టర్ డాక్టర్ పి.ఆర్.కె. రాజు, వివిధ విభాగాల అధిపతులు, ఎ.పి.ఎస్.ఎస్.డి.సి అధికారులు మహేష్, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us