గౌరీలంకేష్ ని హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలి

UPDATED 6th SEPTEMBER 2017 WEDNESDAY 3:00 PM

పెద్దాపురం/సామర్లకోట: బెంగుళూరుకు చెందిన ప్రముఖ సీనియర్ పాత్రికేయురాలు గౌరీలంకేష్ ను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజె సంఘ సభ్యులు బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘ గౌరవ అధ్యక్షుడు అడపా వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు, అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, కార్యదర్శి రెడ్డిపల్లి రమణమూర్తి (బుల్లియ్య) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా డీపీఆర్వో కార్యాలయం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాత్రికేయులకు సమాజంలో రోజురోజుకు భద్రత లేకుండా పోతోందని, వారి రక్షణకు పటిష్ట చట్టాన్ని రూపొందించాలన్నారు. గౌరీలంకేష్ ను హత్యచేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఏపీయూడబ్ల్యూజె జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ పి. వీరభద్రవర్మ మాట్లాడుతూ నిజాలు నిర్భయంగా ప్రచురించే పాత్రికేయులపై దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. విలేఖరుల రక్షణకు ప్రభుత్వాలు కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పెద్దాపురం ఆర్డీవో కార్యాలయ ఏవో విద్యాసాగర్, సామర్లకోట తహసీల్దార్ కార్యాలయ డీటీ ప్రసాద్ కు వినతిపత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పెద్దాపురం నియోజకవర్గ ఉపాధ్యక్షుడు కోశెట్టి రాంప్రసాద్, ఆర్గనైజింగ్ కార్యదర్శి దేవరకొండ సుధాకర్, సహాయ కార్యదర్శి వినాయక్, పాత్రికేయులు ఆలీ, వెంకట్, సుబ్రహ్మణ్యం (సుబ్బు), ఆనంద్, మల్లేష్, సారధి, కరెడ్ల రాజా, సూర్య రామకృష్ణ, వంగలపూడి సురేష్, ఎస్ఎంఎస్ సభ్యులు ముక్తార్ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us