వాడివేడిగా మండల పరిషత్ సమావేశం

UPDATED 9th JUNE 2018 SATURDAY 9:00 PM 

సామర్లకోట: సామర్లకోట మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం శనివారం వాడివేడిగా సాగింది. ఎంపిపి ఆకునూరి సత్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీటీసీ, ఎంపిటీసీలు, వివిధ గ్రామాల సర్పంచులు హాజరైనారు. మత్య శాఖ నివేదికను ఎం.పి.ఎఫ్.ఎ ఎస్. శ్రీనివాస్ వినిపించేందుకు సిద్దపడగా మండల పరిధిలో అనేక పొలాలు నిబంధనలకు విరుద్ధంగా చేపల చెరువులుగా మారిపోతున్నాయని, మండల పరిషత్ సమావేశాలకు మత్యశాఖ అధికారులు ఎందుకు హాజరు కావడం లేదని పెదబ్రహ్మదేవం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యుడు మామిడాల రామకృష్ణ తదితరులు మత్య శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. తక్షణం మండలంలోని అన్ని సొసైటీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎల్. శివకుమార్ మాట్లాడుతూ చేపల చెరువులకు సంబంధించిన అనుమతులు పొందేందుకు ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని, వ్యవసాయ, భూగర్భ జలాలు, ఇరిగేషన్ శాఖల నుంచి అనుమతి పొందాల్సి ఉందన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమావేశంలో సభ్యులు గళమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వై. శివరామకృష్ణ, ఎంపిడివో కె. స్వప్న, ఈవోపిడి సి.హెచ్. జగ్గారావు, మండల ప్రత్యేక అధికారి రాజశేఖర్, ఈ కార్యక్రమంలో ఎంఈవో వై శివరామకృష్ణ ఎంపిడివో కె. స్వప్న, ఈవోపీఆర్డీ సి.హెచ్. జగ్గారావు, మండల ప్రత్యేక అధికారి రాజశేఖర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us