UPDATED 27th DECEMBER 2018 THURSDAY 6:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో గల ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్ షిప్ ఆధ్వర్యంలో ఐకానిక్-2018 కార్యక్రమం గురువారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదిరెడ్డి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో పారిశ్రామికంగా ప్రగతి సాధించాలంటే విద్యార్థి దశ నుంచి పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా కృషి చేయాలి, ఎలాంటి వ్యక్తిత్వం అలవర్చుకోవాలి, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐ2ఈ విభాగాన్నిఆయన అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు సాంకేతికంగా అభివృద్ధి కలిగే ఇటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొని అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఎక్స్ పో, పవర్ పాయింట్ ప్రెజంటేషన్, వకృత్వం, పోస్టర్ ప్రెజంటేషన్, ఎక్స్పోరింగ్ విజన్ టెస్ట్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 29వ తేదీన జరిగే అభినందన సభలో బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుందని రమేష్ తెలిపారు.







