పోషకాహారం ప్రాధాన్యతపై ర్యాలీ

UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ అయోధ్యరామపురం సెక్టార్ ఆధ్వర్యంలో స్థానిక తోట గోపాలకృష్ణ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనచైతన్యం ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైల్డ్ లైన్, కాకినాడ నుంచి ఐసీపీఎస్ శ్రీనివాస్, చందు మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టడం, బాలల హక్కుల పరిరక్షణ, వీధి బాలలను గుర్తించి వారిని చదువుకునేలా శ్రద్ధ చూపాలని అన్నారు. బాల కార్మికులను గురించి వారి తల్లిదండ్రులతో పని మాన్పించి పిల్లలను చదువుపై ధ్యాస ఉండేలా చూడాలని అన్నారు. చట్టాలు, బాల నేరాలు, లింగ వివక్షత, ఆడపిల్లలను కాపాడుదాం, ఆడపిల్లలను చదివిద్దాం అనే సమాజంపై వివరించారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్  నళిని మాట్లాడుతూ పోషకాహారం, రక్తహీనత గురించి, విద్య ఆవశ్యకత, శరీర, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ నేతల వెంకటలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యక్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us