UPDATED 5th MARCH 2018 MONDAY 10:00 PM
సామర్లకోట: సామాజిక సేవల్లో ఇన్నర్ వీల్ సేవలు భేష్ అని పలువురు కొనియాడారు. ఇన్నర్ వీల్ క్లబ్ చైర్మన్ వి. శ్రీదేవి అఫీషియల్ క్లబ్ విజిట్ సందర్భముగా సామర్లకోట, పెద్దాపురంలో వివిధ సేవా కార్యక్రమాలు ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు చేపట్టారు. స్థానిక బ్రౌ న్ పేట మున్సిపల్ ప్రైమరీ పాఠశాలను హ్యాపీ స్కూలుగా తీర్చిదిద్దారు. ఆ పాఠశాలలో వాటర్ ట్యాంక్ నిర్మించి టాయిలెట్లను హ్యాండ్ వాల్స్ నిరంతర నీటి సరఫరాను ఏర్పాటు చేశారు. అలాగే పెద్దాపురంలోని పద్మనాభ కాలొనీ మున్సిపల్ ప్రైమరీ స్కూలుకు కూడా వాటర్ ట్యాంక్ నిర్మించి నీటి సరఫరా ఏర్పాటు చేశారు. సుమారు రూ. లక్షతో విద్యార్థులకు టైలు, బెల్టులు మొదలైనవి పంపిణీ చేయడం జరిగిందని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు ఎ. జయలక్ష్మి, కార్యదర్శి డాక్టర్ టి.ఇందిరారాణి, పి. సత్యాదేవి, సభ్యులు ఉమాదేవి, వీర రాఘవమ్మ, ఉషారాణి, సామర్లకోట మున్సిపల్ కమిషనర్ ఎం. వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ ఊబా జాన్ మోజస్, సత్యన్నారాయణ, పెద్దాపురం యంఈవో దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







