UPDATED 26th JULY 2019 FRIDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై బెంగుళూరుకు చెందిన బి2బి ప్రాజెక్ట్ మేనేజర్ ఎమ్. మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఐటి రంగంలో ఏ కోర్సు నేర్చుకొంటే ఏఏ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విరివిగా ఉంటాయో విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు వాటికి అనుగుణంగా అదనపు నైపుణ్యం కలిగి ఉండాలని, వేగంగా అభివృద్ధి చెందుతున్న విజ్ఞాన ప్రపంచంలో వివిధ మాధ్యమాల ద్వారా విద్యను గ్రహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతులు ప్రొఫెసర్ ఎ. వానతి, ప్రొఫెసర్ ఎం. రాజాబాబు, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







