ప్రజా సమస్యల పరిష్కారానికి నగరదర్శిని దోహదం

UPDATED 23rd AUGUST 2018 THURSDAY 9:00 PM 

సామర్లకోట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్ననగరదర్శిని కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. పట్టణ పరిధిలోని ఒకటవ వార్డులో గురువారం నిర్వహించిన నగరదర్శిని కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి ఆర్డీవో పర్యటించారు. ఈ సందర్భంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ చేపట్టిన వివిధ అభివృద్ది పధకాలు, సంక్షేమ పధకాలు గురించి వివరించారు. రాబోయే కాలంలో వివిధ పధకాల ద్వారా అభివృద్ధి చేసే ప్రణాళికలను తయారు చేయడానికి కావలసిన సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సి.హెచ్. రామారావు, 30 వార్డులకు సంబంధించిన నోడల్ అధికారులు, సాధికార మిత్రలు, సి.ఆర్.పిలు, తదితరులు పాల్గొన్నారు. 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us