UPDATED 12th MARCH 2020 THURSDAY 10:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు యువకులు, మహిళలతో పాటు గ్రామ వాలంటీర్లు కూడా నామినేషన్ వేస్తున్నారు. పెద్దాపురం మండలంలోని కట్టమూరు ఎంపీటీసీ-1 స్థానానికి గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న నంది ఉమామహేశ్వరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేయడం కోసం గ్రామ వాలంటీర్ ఉద్యోగానికి, అలాగే విద్యా కమిటీ సభ్యురాలి పదవికి ఆ యువతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సంబంధిత అధికారులకు ఆమె అందచేశారు. డిగ్రీ పూర్తి చేసిన తాను ప్రజా సమస్యలను తన వంతు పరిష్కరించేందుకే రాజకీయాల్లోకి చేరానని ఆమె పేర్కొన్నారు.







