ప్లాస్టిక్ నివారణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి

UPDATED 21st SEPTEMBER 2019 SATURDAY 8:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్): గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, లియో క్లబ్, రెడ్ క్రాస్ యూనిట్, శ్రీ సర్వారాయ సుగర్స్ సంస్థ (వేమగిరి) సంయుక్త ఆధ్వర్యంలో మనదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు "స్వచ్చత హై సేవ" కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ, రీసైక్లింగ్, రెడ్యూస్ విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ భూతాన్ని సమాజం నుంచి పారద్రోలేందుకు మనమందరం భాద్యత తీసుకోవాలని, ప్లాస్టిక్ నివారణ అనేది మన ఇంటి గడప నుంచే ప్రారంభం కావాలని ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అలాగే విద్యార్థులకు ప్లాస్టిక్ నివారణఫై ప్రశ్నలు సంధించి సరైన సమాధానం చెప్పిన వారికి బహుమతులు అందిoచారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, కోకాకోలా మార్కెటింగ్ మేనేజర్ బి. విజయ్ కుమార్, కోకాకోలా సిబ్బంది, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్స్ పి. శివకుమార్, ఆర్. జ్ఞానవర్జిన్, ఎస్.బి. తిలక్ బాబు, దుర్గాప్రసాద్, సుమారు 250 మంది వాలాంటేర్లు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us