దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలి

UPDATED 26th DECEMBER 2019 THURSDAY 8:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు పిఎస్ నారాయణ, సిఐటియు మండల అధ్యక్షుడు గడిగట్ల సత్తిబాబు పిలుపునిచ్చారు. స్థానిక వినాయక గుడి వద్ద గల జట్టు వర్కర్ల సంఘం కార్యాలయం వద్ద ఏఐటియుసి, సిఐటియు, వివిధ కార్మిక సంఘాల సన్నాహక సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు పిఎస్ నారాయణ, గడిగట్ల సత్తిబాబు మాట్లాడుతూ ఈనెల 29న మధ్యాహ్నం ఒంటిగంటకు స్థానిక యాసలపు సూర్యారావు  భవనంలో సార్వత్రిక సమ్మె విజయవంతంపై సన్నాహక సదస్సు జరుగుతుందని, అనంతరం 3 గంటలకు శ్రీకాకుళం నుంచి బయలుదేరిన కార్మిక సంఘాల బస్సు జాతాకు మున్సిపల్ సెంటర్ వద్ద స్వాగతం పలికి ఆంజనేయస్వామి గుడి సెంటర్ కు తోడ్కొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆంజనేయస్వామి గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభను కార్మికసంఘాలు, ఏపీ ఎన్జీవోలు, పోస్టల్, బ్యాంక్, ఆర్టీసీ తదితర ఉద్యోగ సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిఐటియు మండల ఉపాధ్యక్షుడు దారపురెడ్డి క్రాంతికుమార్, ఏఐటియుసి నాయకులు పెద్దిరెడ్ల సత్యనారాయణ, పెంటకోట సత్తిబాబు, కామిరెడ్డి బోడకొండ, యాకా రామకృష్ణ, పోలిపర్తి తాతారావు, గొంతిన బుల్లిరాజు, గనిశెట్టి శ్రీను, బొట్టా త్రిమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us