Karnataka: బస్సులో.. కోడిపిల్లకు టికెట్‌!

బెంగళూరు (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022: బస్సులో భారీ వస్తువులను తీసుకెళ్తే.. అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని మనకు తెలుసు. కానీ ఓ బుల్లి కోడి పిల్లకు హాఫ్ టికెట్ తీసుకున్న వింత ఘటన కర్ణాటకలో జరిగింది. సిద్ధపుర నుంచి ఓ సంచార కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు.. రూ.10 చెల్లించి కోడి పిల్లను కొనుగోలు చేశారు. దాన్ని తీసుకుని హోసనగర వద్ద కేయస్ఆర్టీసీ బస్సు ఎక్కారు. కోడిపిల్లకు కూడా టికెట్ తీసుకోవాలని కండక్టర్ సూచించాడు. బస్సులో కోడిపిల్లకు టికెట్ తీసుకోవాలనే నియమం ఉందని అతడు చెప్పడంతో.. ఆ కుటుంబం దానికి హాఫ్ టికెట్ తీసుకుంది. ఇలా రూ.10తో కొనుగోలు చేసిన కోడి పిల్లను తీసుకెళ్లేందుకు.. ఆ కుటుంబం రూ.50 చెల్లించి టికెట్ తీసుకోవాల్సి వచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us