ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన జాయింట్ కలెక్టర్

UPDATED 20th DECEMBER 2019 FRIDAY 8:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): సామర్లకోట మండలం మేడపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తేమ శాతం చూసే యంత్రం, రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ క్రాప్ వల్ల రైతులకు ఆలస్యం లేకుండా చూడాలని మండల వ్యవసాధికారిణి ఐ. సత్యను ఆయన ఆదేశించారు. రబీ సీజన్ కు సంబంధించి రైతులు తప్పకుండా ఈ-పంటలో నమోదు చేసుకోవాలని తెలిపారు. పిఎసిఎస్ అధ్యక్షుడు పాలచర్ల సత్యన్నారాయణ మాట్లాడుతూ రోజుకు మూడు వేల క్వింటాళ్ల కంటే ఎక్కువ కొనుగోలు చేసేలా కల్పించాలని జెసిని కోరారు. జేసీ వెంట జిల్లా పౌరసరఫరాల సంస్థ డిఎం ఇ.యన్. జయరాం, డిఎస్ఓ ప్రసాదరావు, సొసైటీ డైరెక్టర్ జి. దేవుడుబాబు, సిఇవో జె.వి. సత్యనారాయణమూర్తి, ఏఈఓ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us