UPDATED 17th AUGUST 2020 MONDAY 8:00 PM
రావులపాలెం (రెడ్ బీ న్యూస్): వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ముంపు ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రితో మాట్లాడారు. జిల్లాలో వరదల కారణంగా అధికారి యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉందని, అలాగే ప్రస్తుతం గోదావరి నదికి చేరుతున్న వరద నీటి పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు వంటి అన్ని సహాయక చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు.







