* రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్
UPDATED 22nd JUNE 2020 MONDAY 6:30 PM
రాజమహేంద్రవరం(రెడ్ బీ న్యూస్): నిరుపేదలకు ఆర్ధికంగా ఆదుకునేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వివిధ రకాల పింఛన్లను అందజేస్తున్నారని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నూతన పింఛన్లను మంజూరు చేసిన నేపథ్యంలో సోమవారం నాడు ఆనంద్ నగర్ గ్రామ సచివాలయం పరిధిలో లబ్ధిదారులకు ఈ కొత్త పింఛన్లు కార్డులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎటువంటి ఆధారం లేని వృద్ధులు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలును ఆర్థికంగా ఆదుకునేందుకు పింఛను పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పటిష్టంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఆనంద్ నగర్ గ్రామ సచివాలయం పరిధిలో ఇప్పటికే 447 పెన్షన్లు ఉన్నాయని, కొత్తగా మరో 27 మందికి ఈ పింఛన్లు మంజూరు అయ్యాయని ఎంపీ భరత్ రామ్ అన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్, సబ్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఎన్.వీ.వీ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.







