UPDATED 6th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: గోదావరి అర్బన్ డవలప్ మెంట్ అథారిటీ (గుడా) పరిధిలో గల మున్సిపల్ కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు గుడా వైస్ చైర్మన్ అమరేంద్ర కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజకీయ పార్టీల నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులతో గుడా ప్రణాళిక అమలు తీరుపై బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ రీజియన్ కు సంబంధించిన పెర్ స్పెక్టివ్ ప్లాన్-2050, మాస్టర్ ప్లాన్-2040, జోనల్ డవలప్ మెంట్ సిద్ధం చేసే నిమిత్తం, అలాగే సామర్లకోట మున్సిపాలిటీ మాస్టర్ ప్లానుకు సంబంధించిన మార్పులు, చేర్పులు చేయడానికి సూచనలు సలహాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ లియో అసోసియేట్స్ సౌత్ ఆసియా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.







