UPDATED 10th MARCH 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్ లో ఉన్న కొవ్వూరి బసివిరెడ్డి సత్రానికి మున్సిపల్ అధికారులు శనివారం తాళాలు వేశారు. మున్సిపాలిటీకి చెల్లించవలసిన పన్ను బకాయిలు రూ. 16 లక్షలు ఉందని, ఈ విషయమై పలుమార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో తాళాలు వేశామని మున్సిపల్ కమీషనర్ సి.హెచ్ వెంకటేశ్వరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.







